తదుపరి వార్తా కథనం
Draupadi Murmu: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన..ఎప్పుడంటే..
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 16, 2025
12:17 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌కి రానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో ఆమె బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచే 1:30కి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లేలా కార్యక్రమం రూపొందించారు. రాజ్‌భవన్‌లోనే ఆమె మధ్యాహ్న భోజనం చేసి, సాయంత్రం 3:25 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు.
వివరాలు
నవంబర్ 22న పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
తర్వాత సుమారు 3:50 గంటల సమయంలో బొల్లారం ప్రాంతంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగే భారతీయ కళా మహోత్సవంలో ఆమె పాల్గొంటారు. అనంతరం 6:15కి మళ్లీ రాజ్‌భవన్‌కి తిరిగి వెళ్తారు. అక్కడే ఆమె రాత్రి బస చేయనున్నారు. తరువాతి రోజు, అంటే 22వ తేదీ ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరనున్నారు.