
Sitaare Zameen Par: 'సితారే జమీన్ పర్'కు రాష్ట్రపతి ప్రశంసలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సితారే జమీన్ పర్'ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి, రాష్ట్రపతితో పాటు ఆమె కుటుంబసభ్యులు, సిబ్బంది, చిత్రబృంద సభ్యులు ఈ చిత్రాన్ని చూసారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. భారత రాష్ట్రపతి మా సినిమా 'సితారే జమీన్ పర్'ని వీక్షించడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. సినిమా మీద ఆమెకున్న ఆదరణ మాకు ప్రత్యేకం.
Details
టీం తరుపున రాష్ట్రపతికి ధన్యవాదాలు
ఆమె ప్రశంసలు మాకు ఎంతో విలువైనవి. మా టీమ్ అందరి తరఫున రాష్ట్రపతికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ క్షణాలను మేమెప్పటికీ మరిచిపోం" అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 'తారే జమీన్ పర్'కు సీక్వెల్‌గా తెరకెక్కిన 'సితారే జమీన్ పర్'లో చదువులో వెనుకబడే చిన్నారులు మానసికంగా ఎదుర్కొనే సవాళ్లను 'తారే జమీన్ పర్'లో చూపిస్తే, ఈ సినిమాలో మానసిక దివ్యాంగులు తమకున్న కష్టాలను అధిగమించి ఎలా విజయం సాధిస్తారో చిత్రీకరించారు. జెనీలియా ఇందులో కీలక పాత్ర పోషించగా, ఆమిర్ ఖాన్ కోచ్ పాత్రలో కనిపించి సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదలైంది.