LOADING...
Rajya Sabha:రాష్ట్రపతి కీలక నిర్ణయం..  రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్‌
రాష్ట్రపతి కీలక నిర్ణయం.. రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్‌

Rajya Sabha:రాష్ట్రపతి కీలక నిర్ణయం..  రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయ, దౌత్య, చరిత్ర, సామాజిక సేవల రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులు ఎంపికయ్యారు. నామినేషన్ పొందినవారిలో ఉజ్వల్ నికం, దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన ఉపాధ్యాయుడు సి. సదానందన్ మాస్టర్ ఉన్నారు. ఉజ్వల్ నికం దేశంలోని అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో ఉజ్వల్ నికం ఒకరు. 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసు సహా అనేక ప్రముఖ కేసుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముంబయి నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓడిపోయారు.

Details

హర్ష్ వర్ధన్ శ్రింగ్లా

భారత మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా అంతర్జాతీయ స్థాయిలో కీలక పదవులు నిర్వహించారు. అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లకు భారత రాయబారిగా పని చేశారు. అంతేకాదు, 2023లో భారత్‌ G20 అధ్యక్షత్వానికి చీఫ్ కోఆర్డినేటర్‌గా సేవలందించారు. సి. సదానందన్ మాస్టర్ కేరళకు చెందిన సదానందన్ మాస్టర్ ఉపాధ్యాయునిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. భాజపా నేతగా కూడా సేవలందించారు. 1994లో సీపీఎం కార్యకర్తల దాడిలో తన రెండు కాళ్లను కోల్పోయారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన భాజపా తరఫున పోటీ చేశారు.

Details

మీనాక్షి జైన్

చరిత్రకారిణిగా ప్రసిద్ధి చెందిన మీనాక్షి జైన్ విద్యారంగంలో తన సేవలకు గుర్తింపుగా 2020లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా కూడా సేవలందించారు.