Page Loader
Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన
మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన

Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2024
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఆయన భారత్‌ మండపంలో జిల్లా న్యాయవ్యవస్థలపై జరిగిన జాతీయ సదస్సులో మాట్లాడారు. మహిళలపై దాడుల విషయంలో న్యాయ వ్యవస్థ వేగంగా స్పందించి, శిక్షలను కఠినంగా విధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న చట్టాలు మహిళల భద్రతకు బాసటగా నిలవాలని, 2019లో తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు చట్టం దీనిలో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు.

Details

ప్రధానికి లేఖ రాసిన మమతా బెనర్జీ

కోల్‌కతాలో ఇటీవల ఓ రెసిడెంట్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చట్టాలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మమతా బెనర్జీ లేఖకు కేంద్రం కూడా స్పందించింది.

Details

కోల్‌కతా ఘటనపై స్పందించిన రాష్ట్రపతి

దేశంలో ఉన్న ప్రస్తుత చట్టాలు మహిళలపై నేరాలను నివారించడంలో సమర్థవంతంగా ఉపయోగపడతాయని స్పష్టం చేసింది. కోల్‌కతా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తనను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి ఘటనలు సమాజంలో భయానకతను పెంచుతాయని పేర్కొన్నారు.