LOADING...
PM Modi: భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ

PM Modi: భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు బయల్దేరారు. నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్‌లోని థింపులో ప్రధాని పర్యటించనున్నారు. ఆయన భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ సమీపంలో జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులను తెలుసుకున్నారు. ఈవివరాలను అర్థం చేసుకుని, ప్రధానమంత్రి మోడీ భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బయల్దేరిన మోదీ