తదుపరి వార్తా కథనం

PM Modi: అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 27, 2025
12:21 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలను దర్శించనున్నారు. పర్యటనలో ముఖ్యంగా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనాలు ఉంటాయి. అలాగే కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అదనంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపతారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి లోకేశ్ శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీలతో పంచుకున్నారు.