LOADING...
PM Modi: ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

PM Modi: ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 11, 2025
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగనున్న ఆయన పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదీ: ప్రధాని మోడీ ఉదయం 7.50 గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి, 10.20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి చేరుతారు. అక్కడి నుంచి 10.25 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సున్నిపెంట హెలిప్యాడ్‌కి చేరుకుంటారు. 11.05 గంటలకు సున్నిపెంట చేరి, రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కి చేరతారు. 11.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం 12.45 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు తిరిగి చేరుకుని, 1.25 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కి బయల్దేరతారు.

Details

సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ

1.40 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కి చేరతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌లో చేరి, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని, 4.15 గంటలకు రోడ్డు మార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కి చేరతారు. 4.40 గంటలకు నన్నూరు హెలిప్యాడ్‌ నుంచి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరి రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోకి చేరి పర్యటన ముగుస్తుంది

Details

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ముఖ్యమైన షెడ్యూల్

7.50 AM: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం 10.20 AM: కర్నూలు ఎయిర్‌పోర్ట్ 10.25 AM: సున్నిపెంటకు హెలికాఫ్టర్ 11.10 AM: శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరిక 11.45 AM: భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం 12.45 PM: భ్రమరాంబ గెస్ట్ హౌస్ తిరిగి చేరిక 1.25 PM: సున్నిపెంటకు రోడ్డు మార్గంలో బయల్దేరి 1.40 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక 2.30 PM: రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 4.00 PM: బహిరంగ సభ 4.15 PM: నన్నూరు హెలిప్యాడ్ చేరిక 4.40 PM: కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కి బయల్దేరి 7.15 PM: ఢిల్లీలోకి చేరి పర్యటన ముగింపు