LOADING...
solar power plant: రామగిరిలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన
300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన

solar power plant: రామగిరిలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలంలో 300 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్ర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ రూపంలో శంకుస్థాపన చేశారు. రాజస్థాన్ బాంస్‌వాడా నుంచి దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అదే క్రమంలో రామగిరిలో సౌర ఎన్‌ర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) ఆధ్వర్యంలో 1,047 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ సౌర విద్యుత్ కేంద్రానికి పునాది వేశారు. నెడ్‌క్యాప్ వీసీఎండీ కమలాకర్ బాబు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి పరిసర గ్రామాల్లో కనీసం వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. సౌర విద్యుత్ కేంద్రానికి సంబంధించిన శిలాఫలకాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆవిష్కరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రామగిరిలో 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం