
Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత సైనికులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా, భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ,వారి శౌర్యాన్ని ప్రశంసించారు.
అలాగే,ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రస్తావించారు.సైనికులను ఉద్దేశిస్తూ ప్రధాని మాట్లాడుతూ.."మన సోదరీమణుల కుంకుమను తుడిచే ప్రయత్నం చేసిన ఉగ్రవాదులను వారి ఇంట్లో దూరి హతమార్చిన ఘనత భారత సైన్యానికి చెందుతుంది. మన సైన్యం ధైర్యంగా నిలబడి ఉగ్రవాదుల స్థావరాలను సమూలంగా ధ్వంసం చేసింది.ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేశారు. భారత ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎలా ఎదుర్కోవాలో భారత సైన్యం చూపించింది.మన డ్రోన్లు,క్షిపణుల సామర్థ్యం చూసి పాకిస్థాన్‌కు నిద్ర పట్టడం లేదని" అన్నారు.
వివరాలు
రాబోయే తరాలకు స్ఫూర్తి
భవిష్యత్తులో, అంటే నేటి నుండి పదేళ్ల తర్వాత కూడా భారత శౌర్యంపై చర్చ జరుగుతుంటే, ఆ సమయంలో మీ అందరినీ ప్రేరణగా ప్రస్తావించక తప్పదు అని సైనికులను అభినందించారు.
మీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు.
"ఈ వేదికపై నుంచి త్రివిధ దళాలు,బీఎస్ఎఫ్‌కు నేను సెల్యూట్ చేస్తున్నాను.మీ ధైర్యసాహసాల కారణంగా 'ఆపరేషన్ సింధూర్'పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది" అని అన్నారు.
ఈ యుద్ధంలో భారత సమాజం మొత్తం సైన్యానికి అండగా నిలబడిందని, ప్రతి భారతీయుడు మీ విజయానికి ప్రార్థన చేశాడని గుర్తు చేశారు.
వివరాలు
మీరు చరిత్ర సృష్టించారు
భారతీయులందరికి భారత సైనిక బలగాలు, వారి కుటుంబాల పట్ల గొప్ప గౌరవం, కృతజ్ఞత ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
భారతదేశం బుద్ధుడి, గురు గోవింద్ సింగ్ వంటి మహానుభావుల పుణ్య భూమి అని అన్నారు.
కొన్ని దేశాల నుంచి వచ్చిన అణుబాంబు ముప్పులను భారత సైన్యం ధైర్యంగా తిప్పికొట్టిందని, ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఒక్కటే.. "భారత్ మాతాకీ జై" అని చెప్పారు.
"మీరు చరిత్ర సృష్టించారు. మీ అందరిని వ్యక్తిగతంగా కలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను" అని మోదీ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ వినండి
Interacted with the air warriors and soldiers at AFS Adampur. Their courage and professionalism in protecting our nation are commendable. https://t.co/hFjkVIUl8o
— Narendra Modi (@narendramodi) May 13, 2025