Page Loader
ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత

ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ

వ్రాసిన వారు Stalin
Dec 28, 2022
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ & రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్‌లను విడుదల చేస్తూ.. మోదీ తల్లి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్నారు. హీరాబెన్‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు సీఎం భూపేంద్ర పటేల్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తల్లి ఆనారోగ్యం విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ప్రధాని మోదీ దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. ఆస్పత్రికి చేరుకొని తల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తల్లిని చూడటానికి మోదీ వచ్చిన నేపథ్యంలో హాస్పటల్ వద్ద భారీగా భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.

నరేంద్రమోదీ

బులిటెన్ విడుదల.. నిలకడగా ఆరోగ్యం..

హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు తాజాగా బులిటెన్‌ను విడుదల చేశాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పాయి. మోదీ తల్లి త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ శ్రేణలు పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం మైసూర్ సమీపంలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇది జరిగిన మరుసటి రోజే హీరాబేన్ అస్వస్థతకు గురయ్యారు. డిసెంబర్ 5న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ తన తల్లిని చివరిసారి కలిశారు.