
PM Modi: రామనవమికి పంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
అలాగే,అత్యాధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా రూపొందించిన కొత్త పంబన్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించనున్నారు.
తమిళనాడులో సముద్ర తీరాన ఉన్న చారిత్రక పంబన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే పేరుతో కొత్త బ్రిడ్జిని నిర్మించారు.
ఆధునిక ఇంజనీరింగ్ వినూత్నతతో ప్రజలను,ప్రదేశాలను అనుసంధానిస్తూ వర్టికల్ లిఫ్ట్ మోడల్‌లో ఇది నిర్మితమైంది.
భారత్‌లో నిర్మించిన తొలి రైల్వే బ్రిడ్జిగా దీనికి ప్రాముఖ్యత ఉంది. వేగం, భద్రత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఈ బ్రిడ్జికి సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు.
వివరాలు
2019 నవంబర్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన
దేశ ప్రధాన భూభాగాన్ని తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానించే ఈ బ్రిడ్జి, మధ్య భాగంలో భారీ ఓడలు వెళ్లేందుకు అనుకూలంగా తెరుచుకునే ప్రత్యేక గేట్లను కలిగి ఉంది.
కొత్త పంబన్ బ్రిడ్జి ప్రారంభమైన వెంటనే, పాత వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 నవంబర్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
2020 ఫిబ్రవరిలో నిర్మాణం ప్రారంభమైంది. అయితే, కోవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. చివరకు, ఏప్రిల్‌లో ఈ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రామనవమికి పంబన్ వంతెన
On the occasion of Ram Navami on 6th April, Prime Minister Narendra Modi will pray at the Ramanathswamy temple at Rameshwaram and also inaugurate the new Pamban Bridge. pic.twitter.com/M0LMzZsDjz
— ANI (@ANI) March 26, 2025