Page Loader
Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ 
Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ

Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ 

వ్రాసిన వారు Stalin
Mar 11, 2024
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చురు లోక్‌సభ ఎంపీ రాహుల్ కశ్వాన్ బీజేపీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చురు ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజా జీవితంలో తాను ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో రాహుల్ కశ్వాన్‌ హస్తం పార్టీలో చేరారు. ఆయన్ను ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. చురు ఎంపీ టికెట్‌ను రాహుల్‌ కశ్వాన్‌‌కు బీజేపీ కేటాయించలేదు. దీంతో అసంతృప్తికి గురైన రాహుల్ పార్టీని వీడారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 రాహుల్‌ కశ్వాన్‌‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న దృశ్యం