LOADING...
Engineering colleges: తెలంగాణలో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలల బంద్‌.. ఎందుకంటే?
తెలంగాణలో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలల బంద్‌.. ఎందుకంటే?

Engineering colleges: తెలంగాణలో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలల బంద్‌.. ఎందుకంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ఇంజినీరింగ్‌,ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో నవంబరు 3 నుంచి బంద్‌ నిర్వహించనున్నట్లు ప్రైవేట్‌ కళాశాలల సమాఖ్య వెల్లడించింది. ఈ నెల 22న ప్రభుత్వం కు నోటీసు అందజేయనున్నట్లు సమాఖ్య తెలిపింది. సమాఖ్య కోర్‌ కమిటీ ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా 25వ తేదీన విద్యార్థి సంఘాలతో, 26వ తేదీన సర్వసభ్య సమావేశాలు జరపాలని, అలాగే నవంబరు 1వ తేదీ నాటికి అన్ని పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్