Loading...
Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్‌కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
రేవంత్ అమెరికా టూర్‌కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్‌కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ స్పందించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్రం నిర్ణయానికి సంబంధించిన కారణాలను వెల్లడించారు. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆయా పర్యటనలకు సంబంధించిన వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ పరిశీలిస్తుందని రణధీర్‌ జయస్‌వాల్‌ తెలిపారు. విదేశీ పర్యటనలు వారు నిర్వహిస్తున్న పదవికి సంబంధించిన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలన్న నిబంధన ఉందని వివరించారు.

వివరాలు 

అందువల్లే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు మాత్రం కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు.

అయితే అమెరికా పర్యటన విషయంలో మాత్రం నిర్దేశించిన నిబంధనలను పాటించలేదని పేర్కొన్నారు.

అందువల్లే రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు రణధీర్‌ జయస్‌వాల్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT