తదుపరి వార్తా కథనం
Delhi: బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. వీహెచ్‌పీ ఆందోళన
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 23, 2025
12:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని న్యూఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వీహెచ్‌పీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వారు బారికేడ్లను తొలగించి కార్యాలయ పరిధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు లోపలికి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
#WATCH | Heavy security deployed near the Bangladesh High Commission in Delhi, in view of a protest announced by Vishva Hindu Parishad against the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/07xQbP3NYo
— ANI (@ANI) December 23, 2025