Pune crash: రక్త నమూనాలను మార్చినందుకు ఫోరెన్సిక్స్ హెడ్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
చేసిందే తప్పు.. దానిని కప్పి పుచ్చుకోవటానికి మరో ప్రయత్నం చేశారు. ఇదంతా పూనేలో ఈ నెల 19న జరిగిన పోర్ష్ కారు ప్రమాదం కధ.
తాగిన మైకంలో వాహనం నడిపిన ఓ టీనేజ్ యువకుడు ఇద్దరు మృతికి కారణమైన సంగతి తెలిసిందే.
ప్రమాదం తర్వాత ఆ యువకుడికి వైద్య పరీక్షల నిమిత్తం సస్సూన్ ఆసుపత్రికి ఉదయం 11 గంటలకి తీసుకు వెళ్లారు.
అయితే అతడు మద్యం సేవించి లేడని ప్రాధమిక రక్త పరీక్ష నిర్వహించిన ఫోర్సెనిక్ ల్యాబ్ (FSL) ధృవీకరించింది.
పోలీసులకు సందేహం వచ్చి వేరే ల్యాబ్ లో పరీక్షకు ఇచ్చారు. ఆ యువకుడి శరీరంలో మద్యం ఆనవాళ్లు కనిపించాయి.
Details
పూనే పోర్ష్ కారుపై ఆది నుంచి వివాదమే
ప్రభుత్వ వైద్యులు ఆ యువకుడిని కాపాడే ప్రయత్నంలో కీలక సాక్ష్యాన్ని తారు మారు చేసి తప్పుడు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ డాక్టర్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
పూనే పోర్ష్ కారు ప్రమాదం మొత్తం మొదటి నుంచి వివాదాల మయంగా మారింది. అతని తాతకి మాఫియా సంబంధాలు వున్నాయి.
ఛోటా రాజన్ కి ముడుపులు కట్టారని సిబిఐ కేసు నమోదు చేసింది. కాగా జువనైల్ కోర్టు టీనేజ్ యువకుడికి తొలుత బెయిల్ మంజూరు చేసింది..
స్ధానిక ప్రజాగ్రహం తట్టుకోలేక బెయిల్ రద్దు చేసి జూన్ 5 వరకు పోలీసుకస్టడీకి పంపింది . దీనితో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు.