Pune: పూనేలో జరిగిన పోర్ష్ కారు ఘటనలో తాత అరెస్ట్
తన మనవడు చేసింది వెధవ పని అని తెలిసి కూడా దానిని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికి పోయాడు ఓ తాత. పాత బాలీవుడ్ సినిమా కధలో మాదిరిగా ప్రయత్నించినా చుక్కెదురైంది.ఈ ఉపోద్ఘాతమంతా మే 19న పూనేలో జరిగిన పోర్ష్ కారు ప్రమాదం చుట్టూ తిరుగుతోంది. దానిని కప్పిపుచ్చడానికి టీనేజ్ యువకుని తాత సురేంద్ర అగర్వాల్ మరో తప్పు చేశాడు. ఇప్పటికే,ఈ కేసులో టీనేజ్ యువకుని తండ్రి విశాల్ అగర్వాల్ సోమవారం అరెస్టై కటకటాల్లో వున్నారు. ఇదిలా ఉంటే ఈ తాత మరో ఘనకార్యం చేశారు.అదేమిటంటే తమ వద్ద పని చేసే డ్రైవర్ గంగారామ్ ను ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లు పోలీసుల ముందు చెప్పాలని వత్తిడి పెంచాడు.
ఇదొక తాత, మనవడి విషాధ కధ
డ్రైవర్ ససేమిరా అనడంతో అతని ఫోన్ లాక్కొని తన బంగ్లాలో బంధించాడు. గంగారామ్ ఎంతకీ ఇంటికి రావకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు . దీంతో వారు పూనే క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు శనివారం తెల్లవారు ఝామున సురేంద్ర అగర్వాల్ బంగ్లా పై దాడి చేసి డ్రైవర్ ను విడిపించారు. పోలీసులు కాపాడే వరకు గంగారామ్ బిక్కు బిక్కు మంటూ గడిపాడు. కాగా సురేంద్ర అగర్వాల్ పై సి.బి.ఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ముంబై నేరసామ్రాజ్యంతో సంబంధాలు వున్న ఛోటా రాజన్ కు ముడుపులు చెల్లించారని కేసు విచారణ కొనసాగుతున్నట్లు ఆ సంస్ధ తెలిపింది.
ఇప్పటి వరకు మూడు కేసులు
దీంతో పోర్ష్ కారు ప్రమాదం కేసులో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదైనట్లు పూనే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. సురేంద్ర అగర్వాల్ అరెస్ట్ తో సహా ఈ కేసులో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి.