Page Loader
Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం

Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొద్ది గంటలకే, పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ తన కేబినెట్‌ను పునఃవ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో, ఆయన ఐదుగురు కొత్త మంత్రులను తన కేబినెట్‌లోకి చేర్చబోతున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అదే సమయంలో, మాన్ కేబినెట్‌లో ఉన్న నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి మాన్ తొలగించాలని నిర్ణయించారు. కొత్తగా కేబినెట్‌లో చోటు పొందిన ఎమ్మెల్యేలు: బిరిందర్ కుమార్ గోయల్,డాక్టర్ రాజివట్,తరణ్ ప్రీత్ సింగ్,మహిందర్ భగత్, హర్దీప్ సింగ్. ఇక చేతన్ సింగ్,శంకర్ జింపా,బల్కర్ సింగ్,అన్మోల్ గగన్ మాన్ కేబినెట్ నుండి విద్వాసన పొందుతున్నారు.

వివరాలు 

స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో నిర్ణయం 

మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడ సంతకం చేయకూడదని సుప్రీంకోర్టు ఆయనకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వివరాలు 

అతిషితో బాటు  మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు

అటు, ముఖ్యమంత్రి పదవికి అతిషిని ఆమ్ ఆద్మీ పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో అతిషి శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు మరికొన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఆమె కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణం చేశారు. అక్టోబర్ 1న ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ మార్పులు చోటు చేసుకున్న కొన్ని గంటలకే, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా దాదాపు ఇదే విధంగా ఘటనలు జరిగినవి గమనించదగిన విషయం.