డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు
2015 కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. చండీగఢ్‌లోని సెక్టార్ 5లో ఉన్న అతని బంగ్లాపై దాడులు చేసిన తర్వాత అరెస్టు జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద అతనిపై నమోదైన పాత కేసుకు సంబంధించి జలాలాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులు తెల్లవారుజామున ఖైరా నివాసంపై దాడి చేశారు. పోలీసులు దాడుల చేసే సమయంలో ఖైరా ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసారు.
నా అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్ష: ఖైరా
ఆ ఫేస్‌బుక్ లైవ్ లో అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వీడియోలో, అతను పోలీసులను వారెంట్ కోరడం, తనను అరెస్టు చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వినవచ్చు. వీడియోలో జలాలాబాద్ DSP అచ్చ్రు రామ్ శర్మ అనే అధికారి ఎమ్యెల్యేను పాత NDPS కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఖైరాతో చెప్పారు. కేసును సుప్రీంకోర్టు రద్దు చేసిందని, అరెస్టును వ్యతిరేకిస్తున్నట్లు ఖైరాపేర్కొన్నారు. ఖైరా ఈ చర్య రాజకీయ కక్షగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే ,అతని కుటుంబ సభ్యుల ప్రతిఘటన మధ్య అధికారులు, ఖైరాను అదుపులోకి తీసుకున్నారు.