Page Loader
Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు
అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు

Purandeshwari: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి విమర్శలు.. రాజకీయ కుట్ర అని ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2024
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు. సంధ్య థియేటర్‌ ఘటనలో ఇతర బాధ్యులను ప్రశ్నించకుండా అల్లు అర్జున్‌ను ఏ11 నిందితుడిగా అరెస్టు చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక హీరోగా అల్లు అర్జున్‌ థియేటర్‌కి వెళ్లారని, ఈ ఘటన ప్రేరేపించడంలో అతనికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పాలని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో స్పెషల్ బెనిఫిట్ షో నిర్వహించారు. అల్లు అర్జున్‌ కుటుంబ సభ్యులు ఈ షోను వీక్షించేందుకు థియేటర్‌కు వెళ్లారు.

Details

స్పందించిన సీఎం

ఈ సమయంలో థియేటర్ బయట భారీ తోపులాట చోటుచేసుకోవడంతో ఒక మహిళ ఊపిరాడక మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. థియేటర్ యజమానులతో పాటు అల్లు అర్జున్‌పై ఏ11 నిందితుడిగా కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ విధించింది. జైలు అధికారులు సంబంధిత పత్రాలు అందుకున్న వెంటనే, హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నల మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Details

సినీ ఇండస్ట్రీపై రాజకీయ కక్ష సాధింపు

సినీ ఇండస్ట్రీ బాధ్యతగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. పురందేశ్వరి ఈ వ్యవహారంలో రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీపై దాడులు చేయడం సరికాదని, కేవలం పాపులారిటీ కారణంగా అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకున్నారని, ఇది తక్షణమే నిలిపివేయాలని ఆమె తెలిపారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక నుంచి పబ్లిక్ ఈవెంట్లలో భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాలు, సినీ పరిశ్రమకు బీజేపీ సూచించింది.