Musi River: మూసీ నది ప్రక్షాళన.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై 46 పిటిషన్లను విచారించి, హైకోర్టు నిర్ణయాత్మక తీర్పును వెల్లడించింది.
నది గర్భం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ ప్రాంతాల్లో ఉన్న చట్టవిరుద్ధ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని పేర్కొంది. మూసీలోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.
ఈ తీర్పులో ఆక్రమణదారులకు నోటీసులిచ్చాకే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.
1)నిర్మాణాల తొలగింపు
మూసీ బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్, రివర్‌బెడ్ ప్రాంతాల్లో ఉన్న చట్టవిరుద్ధ నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా ఖాళీ చేయించాలి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు నోటీసులిచ్చాకే కూల్చివేత చర్యలు చేపట్టాలి.
Details
2. ప్రభావితులకు పునరావాసం
పునరుద్ధరణతో ప్రభావితులైన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించాలి.
పేదలకు ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతాల్లో నివాసాలను కల్పించడంతో పాటు తగిన పరిహారం కూడా అందించాలి.
3. నిర్వహణ పద్ధతులు
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను గుర్తించడానికి నిర్వహించే సర్వేకు ఎలాంటి అడ్డంకులు సృష్టించరాదని ఆక్రమణదారులకు హెచ్చరిక.
ఈ చర్యల అమలు కోసం పోలీసు భద్రతను అందించాలని హైకోర్టు ఆదేశించింది.
4. ఆక్రమణదారులపై చర్యలు
నదులు, చెరువులు, నీటి వనరులపై ఆక్రమణలు చేపట్టిన వారిపై వాల్టా చట్టం, తెలంగాణ నీటిపారుదల చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
Details
అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ నది సుందరీకరణ
2002లో ప్రవేశపెట్టిన వాల్టా చట్టం ద్వారా జలవనరుల పరిరక్షణకు కఠినమైన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడికతీత, కట్టల నిర్మాణం వంటి చర్యలను చేపట్టారు.
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులతో నిర్మాణాలు చేసినా అవి చట్టవిరుద్ధంగా కూల్చివేశారని పిటిషనర్లు చెప్పారు. సర్వే లేదా నోటీసులు లేకుండానే కూల్చివేతలు జరగడం అన్యాయమని వారు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భాగంగా 10,017 నిర్మాణాలను గుర్తించి, వారిని మానవీయ కోణంలో పునరావాసం కల్పిస్తున్నట్లు తెలిపారు.
15,000 డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించడంతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ సుందరీకరణ చేపట్టి, శుభ్రమైన నీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.