Putin: దిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో దిల్లీ పాలం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా పౌర అణుశక్తి రంగంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశముంది. పుతిన్ గౌరవార్థంగా ప్రధాని మోదీ గురువారం దిల్లీలో ప్రత్యేక విందును నిర్వహించనున్నారు. అనంతరం శుక్రవారం దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్‌లో నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల నేతలు పాల్గొననున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
Visuals of PM Modi's convoy at Palam airport.
— News Arena India (@NewsArenaIndia) December 4, 2025
Putin's plane just now landed. pic.twitter.com/JGW4MNDin8
వివరాలు
పుతిన్ పూర్తి షెడ్యూల్:
మొదటి రోజు: రాత్రి 7.00: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో విందు. 2వ రోజు: ఉదయం 11.00: పుతిన్ రాష్ట్రపతిని కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళతారు. ఉదయం 11.30: పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమానికి ఆయన రాజ్‌ఘాట్ వైపు వెళతారు. ఉదయం 11.50: నరేంద్ర మోదీతో సమావేశం. మధ్యాహ్నం 1.50: హైదరాబాద్ హౌస్‌లో సంయుక్త విలేకరుల సమావేశం. సాయంత్రం 7.00 గంటలు: పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారు. రాత్రి 9.00 గంటలు: ఆయన తన పర్యటనను ముగించుకుని భారతదేశం నుండి బయలుదేరుతారు.