Tamilanadu-Quary-Bomb Blast: తమిళనాడులో ఓ క్వారీలో భారీ పేలుడు.. నలుగురు మృతి..12 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు(Tamilanadu)లోని ఒక క్వారీ(Quary)లో భారీ పేలుడు(Bomb Blast)సంభవించింది.
ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
విరుదునగర్ జిల్లా కారియాపట్టి శివారులోని ఓ క్వారీలో బుధవారం పెద్ద పేలుడు సంభవించింది.
క్వారీలో రాళ్ల నుంచి సిల్ట్, ఎం ఇసుక వంటి పదార్థాలు విరిగిపోతుంటాయి.
వాటిని క్రషర్ లో పగలగొట్టేందుకు పేలుడు పదార్థాలను (బాంబులు)వాడుతూ ఉంటారు.
ఈరోజు ఉదయం క్వారీ సమీపంలోని ఓ గదిలో పగలగొట్టేందుకు దాచిన పేలుడు పదార్థాలు పేలిపోయాయి.
దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Quary-Bomb Blast
ఇంకా ప్రారంభం కానీ సహాయక చర్యలు
ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పేలుడు పదార్థాల ధాటికి భవనం సమీపంలో ఉన్న రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
అయితే ప్రమాద స్థలిలో మరిన్ని పేలుడు పదార్థాలు ఉండడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టలేకపోతున్నట్లు అధికారులు తెలిపారు.