Osmania Medical College: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్‌కు గురిచేసిన ఆరోపణలపై ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
12 మంది విద్యార్థులు ఆరు నెలల పాటు సస్పెండ్
ర్యాగింగ్ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాలేజీ యాజమాన్యం, ఇందులో ప్రమేయం ఉన్న విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.