Rahul Gandhi: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో రాహుల్ గాంధీ బస్సుపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
అసోంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జైరాం రమేష్ కారుపై దాడి జరిగిన కొద్ది సేపటికే, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న బస్సుపై ఎటాక్ జరిగింది.
ఈ క్రమంలో అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది.. రాహుల్ గాంధీని సురక్షితంగా తరలించారు.
సోనిత్‌పూర్ జిల్లాలో రాహుల్ యాత్ర కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
తమపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలపై దాడి చేయడమే కాకుండా తమ రాహుల్ యాత్రను కవర్ చేస్తున్న మీడియా సిబ్బందిపై కూడా దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.
రాహుల్ గాంధీ
20మంది వ్యక్తులు మాపైకి కర్రలతో వచ్చారు: రాహుల్ గాంధీ
20-25 మంది బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని భారత్ జోడో న్యాయ్ యాత్ర బస్సు వద్దకు వచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
తాను బస్సు నుంచి బయటకు రాగానే వారు పారిపోయినట్లు రాహుల్ పేర్కొన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు కాంగ్రెస్ భయపడుతోందని వారు కలలు కంటున్నారని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అసోం సీఎంకు తాము భయపడబోమని రాహుల్ పేర్కొన్నారు.
అంతకుముందు జుముగురిహాట్‌లో తన వాహనంపై బీజేపీ నాయకులు దాడి చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు.