Rahul Gandhi: 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ సవాల్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్స్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. తనను నక్సలైట్‌గా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు జాతి వ్యతిరేకులు ఎవరు? విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నది ఎవరు? అనే అంశాలపై తనతో బహిరంగ చర్చకు రావాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. 'ప్రధాని చెప్పిన అబద్ధాలను మీరు నమ్మలేదని మీ ముఖాలే చెబుతున్నాయి.ఆయన మమ్మల్ని నక్సలైట్లు అన్నారు. నేను చేసిన సవాల్‌పై ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను' అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
వివరాలు
బస్తర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ..
ఈ అంశంపై చర్చ జరిగితే.. ఆ తర్వాత ప్రధాని ఏ ఒక్క జవాను ఎదుట నిలబడే ధైర్యం కూడా చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. 'దిమాగీ నక్సల్స్' అంశాన్ని ప్రస్తావించారు.
దేశంలో సాయుధ నక్సలిజం ప్రభావం తగ్గినప్పటికీ.. పలు సంస్థలు, రాజకీయ పార్టీల్లోకి ఈ తరహా వ్యక్తులు చొరబడుతున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించడంతో ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత మధ్య రాజకీయ విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాహుల్ గాంధీ చేసిన ట్వీట్
Dear @crpfindia,
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2026
Your faces said it all: you didn't buy the PM's lies.
He called us Naxals.
My challenge stands. Let him debate me on who is anti-national and who is controlled by foreign forces. Any time, any place.
My guarantee: after the debate, the PM won't have the guts… https://t.co/04WWDAABcx