
Rahul Gandhi: రామమందిరం ప్రారంభోత్సవం అనేది మోదీ ఫంక్షన్: రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మంగళవారానికి రెండోరోజుకు చేరుకుంది.
యాత్రంలో భాగంగా రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం మోదీ కార్యక్రమమని రాహుల్ విమర్శించారు.
జనవరి 22వ తేదీన జరిగే రామాల ప్రారంభోత్సవాన్ని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పూర్తిగా రాజకీయ నరేంద్రమోదీ ఫంక్షన్‌గా మార్చాయన్నారు.
ఇది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందిన ఫంక్షన్ కావడం వల్లే తాము హాజరుకావడం లేదని తమ అధ్యక్షుడు చెప్పినట్లు పేర్కొన్నారు.
రాహుల్
ఇదొక రాజకీయ కార్యక్రమం: రాహుల్
తాము అన్ని మతాలు, ఆచారాలకు గౌరవిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
హిందూ మతానికి చెందిన మఠాధిపతులు.. జనవరి 22వ తేదీన జరిగే కార్యక్రమం గురించి ఏం అన్నారో అందరూ చేశారన్నారు.
రామాలయ ప్రారంభోత్సవం అనేది రాజకీయ కార్యక్రమని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర ఆహ్వానాన్ని 'గౌరవపూర్వకంగా' తిరస్కరించిన విషయం తెలిసిందే.
2019లో అయోధ్యకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
శ్రీరాముడిని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ.. ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.