Loading...
Rahul Gandhi: బ్రిక్స్‌ డిన్నర్‌ మెనూపై రాహుల్‌ రాజకీయం.. బీజేపీపై ఘాటు విమర్శలు!
బ్రిక్స్‌ డిన్నర్‌ మెనూపై రాహుల్‌ రాజకీయం.. బీజేపీపై ఘాటు విమర్శలు!

Rahul Gandhi: బ్రిక్స్‌ డిన్నర్‌ మెనూపై రాహుల్‌ రాజకీయం.. బీజేపీపై ఘాటు విమర్శలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూఢిల్లీలో వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలు ముగిశాయి. అయితే ఇప్పుడు ఈ సదస్సుకు సంబంధించిన రాజకీయ చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన ఓ ట్వీట్‌ రాజకీయ వేడి పుట్టించింది. బ్రిక్స్‌ సదస్సులో విదేశీ నేతలకు వడ్డించిన శాఖాహార విందు మెనూపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో 80 శాతం మంది భారతీయులు నాన్‌-వెజ్‌ ఆహారం తీసుకుంటారని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో బ్రిక్స్‌ విందు మెనూపై రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. "రికార్డు కోసం చెబుతున్నాను.. 80 శాతం మంది భారతీయులు నాన్‌-వెజిటేరియన్లు. భారతీయ నాన్‌-వెజిటేరియన్‌ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి.

వివరాలు

విదేశీ నేతలకు ఎందుకు పరిచయం లేదు

అలాగే నా సోదరి చేసే చోలే భటూరే కూడా" అంటూ రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనితో పాటు చోలే భటూరే ఫొటోను కూడా ఆయన షేర్‌ చేశారు.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు మరో కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా మద్దతు తెలిపారు.

భారతదేశంలోని వంటకాల వైవిధ్యంలో ప్రపంచ స్థాయి మాంసాహార వంటకాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

అలాంటి వంటకాలను విదేశీ నేతలకు ఎందుకు పరిచయం చేయలేదని ప్రశ్నించారు.

వివరాలు

విమర్శించిన పవన్ ఖేరా

భారతీయులపై బీజేపీ తన ఆహారపు అభిరుచులను రుద్దుతోందని పవన్‌ ఖేరా విమర్శించారు. ఇప్పుడు విదేశీ నేతలు, అతిథులపై కూడా ఇదే జరుగుతోందని ఆయన ఆరోపించారు.

అయితే ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. బ్రిక్స్‌ దేశాధినేతలు భారతీయ శాఖాహార వంటకాలను ఆస్వాదించారని ఆయన అన్నారు.

"బ్రిక్స్‌ దేశాల నేతలకు వడ్డించిన ఆహార మెనూపై కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తుందంటే నమ్మలేకపోతున్నానంటూ కిరణ్‌ రిజిజు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతిబింబించేలా ఈ శాఖాహార మెనూను రూపొందించినట్లు ఆయన చెప్పారు. రుచితో పాటు పోషక విలువలకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

విందు మెనూలో ఏమున్నాయి?

బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించారు.

ఈ మెనూలో ఖాండ్వీ, పనీర్‌ లబాబ్దార్‌, గుచ్చి మార్మిక్‌, మిల్లెట్‌ పులావ్‌, మష్రూమ్‌ గలౌటీ, జిలేబీ వంటి వంటకాలు ఉన్నాయి.

ఈ విందు మెనూలో మిల్లెట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. భారత్‌ ప్రోత్సహిస్తున్న "శ్రీ అన్న"తో పాటు సుస్థిర ఆహార విధానాన్ని కూడా ప్రతిబింబించేలా ఈ మెనూను రూపొందించారు.

ADVERTISEMENT