'అప్పటి వరకు టీషర్ట్ మీదనే ఉంటా'.. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ ఆసక్తికర కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం దేశంలో కరోనా తర్వాత.. ఆ స్థాయిలో చర్చ జరుగుతున్నది రాహుల్ గాంధీ టీషర్ట్ పైనే. భారత్ జూడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఆయన టీషర్ట్ ధరించే నడన సాగిస్తున్నారు. చలి చాలా ఎక్కువగా ఉండే.. ఉత్తర భారతంలో కూడా రాహుల్ టీషర్ట్ పైనే ఉదయం పాదయాత్ర చేయడాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
బుధవారం జరిగిన కాంగ్రెస్ 138వ ఆవిర్భావ వేడుకలకు కూడా రాహుల్ టీషర్ట్ ధరించి వచ్చారు. ఆవిర్భావ వేడుకల్లో కూడా టీషర్టేనా? అని రాహుల్‌ను ఓవిలేకరి అడిగారు.
పాదయాత్ర మొత్తం టీషర్ట్ మీదే సాగుతోందని, అది సాగేంత వరకు టీషర్ట్ పైనా ఉంటానని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆ రిపోర్టర్‌కు సమాధానం చెప్పారు.
రాహుల్
రాహుల్ వర్సెస్ మోదీ..
దిల్లీలో గడ్డకట్టే చలిలోనూ రాహుల్ టీషర్ట్ ధరించిన పాదయాత్ర చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 52ఏళ్ల వయసులోనూ 25ఏళ్ల యువకుడిగా ఎలా చలిని తట్టుకుంటున్నారని రాహుల్‌ను నెటిజన్లు అడుగుతున్నారు. ఇది రాహుల్ ఫిట్‌నెస్ వల్లే సాధ్యమైందంటూ.. మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ఫీట్ కేవలం రాహుల్‌కే సాధ్యం అంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం చలిని తట్టుకునే విషయంలో రాహుల్ కంటే మోదీనే బెటర్ అంటున్నారు. 52ఏళ్ల వయసులో రాహుల్ టీషర్ట్ వేసుకొని చలిలో నడవడం గొప్పకాదని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో 71ఏళ్ల వయసులో మోదీ.. గడ్డకట్టే నీటిలో గంగాస్నానం చేసి.. 5నిమిషాలకు పైగా ఆనీటిలో గడిపారని అంటున్నారు. అందుకే ఫిట్‌నెస్ విషయంలో మోదీనే గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.