Priyanka Gandhi son Engagement: ప్రియాంక కుమారుడు రేహాన్ వాద్రా, అవీవా బేగ్‌తో నిశ్చితార్థం..!
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా, త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. ఈ విషయం తాజాగా జాతీయ మీడియా వేదికల ద్వారా ప్రచురితమైంది. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. రేహాన్,అవీవా ఏడేళ్లుగా స్నేహితులుగా ఉన్నారు. ఇటీవల రేహాన్ పెళ్లి ప్రతిపాదనను అవీవాకు చెప్పగా, ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం నిర్వాహించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం గాంధీ,వాద్రా కుటుంబాల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దిల్లీకి చెందిన అవీవా.. ప్రియాంక కుమారుడి మాదిరిగానే ఫొటోగ్రాఫర్ అని తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రియాంక గాంధీ ఇంట వేడుక.. కుమారుడి ఎంగేజ్‌మెంట్..!
प्रियंका गांधी के घर जल्द ही शहनाई बज सकती है. सूत्रों के मुताबिक़ हाल ही में प्रियंका गांधी और रॉबर्ट वाड्रा के बेटे रेहान वाड्रा ने अपनी 7 साल पुरानी गर्लफ़्रेंड अवीवा बेग को प्रपोज़ किया और दोनों के परिवारों ने इस रिश्ते को क़बूल भी कर लिया है. अवीवा और उनका परिवार दिल्ली का… pic.twitter.com/rSfjGRzZMe
— ABP News (@ABPNews) December 30, 2025