LOADING...
Railway projects In AP: ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..  
ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..

Railway projects In AP: ఆంధ్రప్రదేశ్‌లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభలో తెలిపారు. ఈ వివరాలను ఆయన తెదేపా ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పుట్టా మహేష్‌కుమార్‌లు అడిగిన వేర్వేరు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. గత నాలుగేళ్లలో 15 కొత్త రైల్వే లైన్‌లు, 50 డబ్లింగ్ లైన్‌లకు సర్వేలు నిర్వహించామని, వీటి మొత్తం పొడవు 6,985 కిలోమీటర్ల సమానమని రైల్వే మంత్రి వివరించారు.

వివరాలు 

గుంటూరు యార్డ్‌లో మల్టీ ట్రాకింగ్

అంతేకాదు, 2025 ఏప్రిల్‌ 1 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు 12 కొత్త లైన్‌లు, 27 డబ్లింగ్ పనులు మంజూరు అయ్యాయని, వీటికి మొత్తం రూ. 70,232 కోట్ల ఖర్చు ఉన్నదని తెలిపారు. ఇందులో 1,178 కిలోమీటర్ల రైల్వే లైన్‌లు ఇప్పటికే ప్రారంభమై, వాటి కోసం రూ. 28,039 కోట్లు ఖర్చు అయ్యాయని మంత్రి వెల్లడించారు. గుంటూరు డివిజన్‌లో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభమై ఉన్నాయి. గుంటూరు-గుంతకల్లు (401 కి.మీ.), గుంటూరు-బీబీనగర్‌ (239 కి.మీ.) డబ్లింగ్ పనులు గుంటూరు యార్డ్‌లో మల్టీ ట్రాకింగ్ ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 57 కి.మీ పొడవైన కొత్త లైన్‌ల నిర్మాణం ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ. 9,353 కోట్లు.

వివరాలు 

గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్

ప్రస్తుతానికి, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ లైన్‌లో 357 కి.మీ. పనులు పూర్తయి, మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. అలాగే అమరావతి లైన్‌ కోసం భూసేకరణ ప్రక్రియ కూడా జరుగుతున్నది. గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్ పని కూడా కొనసాగుతూనే ఉంది. తదుపరి, రూ. 3,796 కోట్ల విలువ గల భద్రాచలం-కొవ్వూరు (119 కి.మీ) కొత్త లైన్ ప్రాజెక్ట్ కేంద్ర, రాష్ట్రాల 50:50 నిష్పత్తిలో ఆర్థిక భాగస్వామ్యంతో మంజూరు అయ్యిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భద్రాచలం-సత్తుపల్లి (56 కి.మీ.) మధ్య లైన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

Advertisement

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ధాన్య నిల్వలు

కేంద్ర పరిధిలోకి వచ్చే ఆహార ధాన్యాల నిల్వల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐకి 14.35 లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములు ఉన్నట్లు కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి నిమున్‌బెన్‌ జయంతిభాయ్‌ బంభానియా తెలిపారు. అయితే, ఎఫ్‌సీఐ కేంద్ర గోదాముల కార్పొరేషన్ నుంచి 39.38 లక్షల టన్నుల సామర్థ్య గల గోదాములను అద్దెకు తీసుకుంది. బుధవారం లోక్‌సభలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ వివరాలు అందించారు. ప్రాంతవారీగా: ఎఫ్‌సీఐకి కాకినాడ పరిధిలో 90,132 టన్నులు, రాజమండ్రిలో 1,05,792 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నట్లు వివరించారు. కేంద్ర గోదాముల కార్పొరేషన్‌కు రాజమండ్రిలో 51,895 టన్నులు, కాకినాడలో 29,943 టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నట్లు చెప్పారు.

Advertisement

వివరాలు 

2,51,753 కి.మీ. ఓఎఫ్‌సీ నిర్మాణం పూర్తి

ఆంధ్రప్రదేశ్‌లో 2,51,753 కిలోమీటర్ల పొడవైన ఓఎఫ్‌సీ నిర్మాణం పూర్తయిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలోని 2,759 గ్రామాలు ఇప్పుడు 4జీ కనెక్షన్ల పరిధిలోకి వచ్చాయి.

Advertisement