Rain Alert: ఏపీకి హెచ్చరిక.. మరో నాలుగు రోజులు వర్షాలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఈదురు గాలులు గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని హెచ్చరించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వేడి పెరుగుతున్నప్పటికీ, వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉంది.
వివరాలు
ఈ జిల్లాల్లో వర్షాల సూచన
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదే విధంగా బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ఇదిలా ఉంటే ఆదివారం పోలవరం, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం కొంత చల్లబడింది.