Loading...
Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ!
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ!

Rain Alert: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 29న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది నవంబర్ 30 నాటికి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది. డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాంలో నేడు, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పొగమంచు కూడా ఏర్పడవచ్చని పేర్కొంది.

వివరాలు

ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్

రాయలసీమలోనూ ఇదే తరహా వాతావరణం ఉంటుందని, అక్కడ కూడా మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు, పొగమంచు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కోస్తాంధ్రతో పాటు మార్కాపురం, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ 29 తర్వాత వర్షాల తీవ్రతతో పాటు గాలుల వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. కోస్తాంధ్ర ప్రాంతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.

వివరాలు

తెలంగాణలోనూ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

గత కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు ఊరటనిస్తూ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

ఈ ఆకస్మిక మార్పుల నేపథ్యంలో వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు, మేడ్చల్ మల్కాజ్‌గిరి, భువనగిరి, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ వర్షాలు ప్రధానంగా స్థానిక వాతావరణ మార్పుల వల్లే కురుస్తున్నాయని, ఇవి తాత్కాలికమేనని అధికారులు వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

డిసెంబర్ నుంచి పెరగనున్న చలి తీవ్రత

డిసెంబర్ నెల నుంచి తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఎల్‌నినో ప్రభావం మార్చి వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత క్రమంగా తగ్గి జూన్, జులై నాటికి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది.

ఎల్‌నినో ప్రభావంతో ఈసారి చలి సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

చలితో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో రోజువారీ ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ADVERTISEMENT