Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.