Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. మరో ఐదు రోజుల పాటు వానలే!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 31, 2026
12:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ (Weather Department) వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ సాయంత్రం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
వివరాలు
భారీ వర్షాలు కురిసే ఛాన్స్
అలాగే నవంబర్ 2, 3 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అల్పపీడనం ప్రభావంతో రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.