Page Loader
Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు
దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు

Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

వర్షాకాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ ఒకటో తేదీ వరకు 707.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 759.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 14 రాష్ట్రాల్లో సాధారణం కంటే భారీగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ జాబితాలో ఉండడం గమనార్హం.

Details

ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలో అతిభారీ వర్షాలు 

తెలంగాణలో సాధారణ వర్షపాతం 581.2 మిల్లీమీటర్లకు గానూ, ఈ సీజన్‌లో 29 శాతం అధికంగా 751.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా 373.6 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటే, ఈసారి 43 శాతం అధికంగా 534.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ఏడు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాలు అతిభారీ వర్షాలు కురిశాయి.