
Raj Kasireddy: ఏపీ సిట్ పోలీసులు అదుపులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి)ను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు.
ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది.
ప్రస్తుతం అతడిని విజయవాడకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
బెయిల్ కి సమ్మతించని హై కోర్ట్
ఇదిలా ఉండగా, ఈ కేసులో తనకు ముందస్తుగా బెయిల్ మంజూరు చేయాలంటూ రాజ్ కసిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, అందుకు సమ్మతించలేదు.
అలాగే తదుపరి విచారణను మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం విచారణకు తాను స్వయంగా హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.
అయితే ఆయన సందేశం వెలువడిన కొద్దిసేపటికే, ఏపీ సిట్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు.