
Rajamahendravaram: ఏపీఎస్‌ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్ దరఖాస్తుల ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
వివిధ వృత్తులలో అప్రెంటీస్‌షిప్ అవకాశాల కోసం ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఏపీఎస్‌ఆర్టీసీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని ఆర్టీసీ డిపో గ్యారేజీలలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నందున, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 12 వరకు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి (డీపీటీవో) వై.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు.
వివరాలు
ఆర్టీసీ ఓనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన
తరువాత ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియకు అభ్యర్థులు విజయనగరం వి.టి. అగ్రహారంలోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో వచ్చే నెల 14న ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధ్రువీకరణ సమయంలో అభ్యర్థులు రూ.118 ఫీజు చెల్లించి రసీదు పొందిన తర్వాత దాన్ని దరఖాస్తు పత్రాలతో జత చేసి ఆర్టీసీ జోనల్ స్టాఫ్ కళాశాల కార్యాలయానికి సమర్పించవలసిందిగా సూచించారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉంటే, కార్యాలయ పనివేళల్లో 088922-294906 నంబర్ ద్వారా సంప్రదించవచ్చని డీపీటీవో తెలిపారు.