LOADING...
Jaipur: ఆడీ కారుతో మాజీ మంత్రి కుమారుడు బీభ‌త్సం .. ఇద్దరికీ గాయాలు 
ఆడీ కారుతో మాజీ మంత్రి కుమారుడు బీభ‌త్సం .. ఇద్దరికీ గాయాలు

Jaipur: ఆడీ కారుతో మాజీ మంత్రి కుమారుడు బీభ‌త్సం .. ఇద్దరికీ గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ మాజీ మంత్రి కుమారుడు తన ఆడి కారుతో బీభ‌త్సం సృష్టించాడు. జైపూర్‌లో ఆ కారుతో మరో మూడు వాహనాలను ఢీ కొట్టాడు.ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఆడి కారులో మంత్రి కుమారుడితో పాటు మ‌రో ఇద్ద‌రు కూడా ఉన్నారు. మంత్రి కొడుకు మైన‌ర్ అని తెలుస్తోంది,ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటుచేసుకుంది.

వివరాలు 

నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు

ప్రథాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్ఐ సర్కిల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారి రాజేంద్ర శర్మ చెప్పారు. పోలీసు క‌మీష‌న‌ర్ బీజూ జార్జ్ జోసెఫ్ జోక్యం చేసుకున్న త‌ర్వాత‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది. భారతీయ న్యాయసంహితా 281, 125ఏ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి షాక్ వ్యక్తం చేశారు. కేసు ద‌ర్యాప్తులో స‌హ‌క‌రిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆడీ కారుతో మాజీ మంత్రి కుమారుడు బీభ‌త్సం