
రాజస్థాన్‌లో దారుణం.. ట్రాక్టర్‌తో 8సార్లు తొక్కించి యువకుడి హత్య.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
భూ వివాదంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.
బయానా ప్రాంతంలోని అడ్డా గ్రామంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు యువకుడిని ట్రాక్టర్‌తో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8సార్లు తొక్కించి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటన బుధవారం జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
బయానాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డా గ్రామంలో బహదూర్, అతర్ సింగ్ గుర్జార్ కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది.
4రోజుల క్రితం, ఇరువర్గాలు సదర్ పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు, అయితే బుధవారం ఉదయం, భూమి వివాదంపై ఇరువర్గాలు మరోసారి ఘర్షణకు దిగారు.
హత్య
కేసు నమోదు చేసిన పోలీసులు
బహదూర్ వర్గానికి చెందిన వ్యక్తి బుధవారం ఉదయం ట్రాక్టర్‌తో వివాదాస్పద స్థలంలోకి వెళ్లాడు. అతర్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా కూడా భూమి వద్దకు వెళ్లారు.
ఈ సమయంలో అతర్ సింగ్ వర్గానికి చెందిన నిర్పత్ అనే యువకుడు ట్రాక్టర్‌ను ఆపడానికి నేలపై పడుకున్నాడు.
బహదూర్ వర్గానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్‌ను నిర్పత్ పై నుంచి పోనిచ్చాడు. అలా ఏకంగా 8సార్లు ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో నిర్పత్ అక్కడిక్కడే చనిపోయాడు.
గొడవ చూడటానికి వచ్చిన గ్రామస్థులు.. ఈ ఘటనను వీడియో తీయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరుపుతున్నారు.