చిరుత పులులకు కంచెలు వేయలేం: ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ వెల్లడి
అడవుల్లో చిరుతపులులను పెంచడానికి చిరుతపులుల పునఃప్రవేశ ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా ప్రాంతాల నుండి చిరుతపులులను తీసుకొచ్చి మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులో వదిలారు. అయితే ఇటీవల కునో పార్కులో మూడు పెద్ద చిరుతపులులు, కొన్ని పిల్ల చిరుతలు మరణించాయి. ఈ నేపథ్యంలో చిరుతపులుల పునఃప్రవేశ ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ ఆలోచనలో పడింది. చిరుతల ప్రాణాలను కాపాడి వాటి సంఖ్యను ఎలా పెంచాలని కమిటీ ఆలోచిస్తోంది. చిరుతల ప్రాజెక్టును పరిశీలిస్తున్న దక్షిణాఫ్రికా నిపుణుడు విన్సెంట్, ఈ విషయంలో ఒక సలహా ఇచ్చాడు. చిరుతలు ఆవాసముండే ప్రాంతాల్లో కంచె నిర్మించాలని దాని సారాంశం.
కంచె నిర్మిస్తే చిరుతల ఆవాసాలకు దెబ్బ
చిరుతల ఆవాస ప్రాంతాల్లో కంచె నిర్మించబోమని, ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ రాజే గోపాన్ కుండబద్దలు కొట్టేసారు. కంచె వేయడం వల్ల చిరుతల జీవనశైలి దెబ్బతింటుందనీ, చిరుతల సంచారానికి కంచెలు అడ్డుగా నిలుస్తాయని, ఈ కారణంగా జన్యుమార్పిడి జరగదని అన్నారు. ఇండియాలో గత యాభై ఏళ్ళుగా పులుల పునః ప్రవేశ ప్రాజెక్టు విజయవంతంగా జరుగుతోందనీ, పులుల సంఖ్య పెంచినట్టుగానే చిరుతల సంఖ్య పెంచుతామని రాజేష్ గోపాల్ అంటున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా చిరుతలు మరణించాయని, దానికి బాధ్యత, తాను తీసుకుంటానని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ సింగ్ పేర్కొన్నారు.