Page Loader
Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ
'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ

Awadhesh Prasad: 'రామ్, సీతా మీరు ఎక్కడ'?.. బోరున విలపించిన ఎంపీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్య కూడా ఆయన ఎంపీ పరిధిలోనే ఉంది. 2024లో ఫైజాబాద్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున గెలిచిన అవధేష్ ప్రసాద్, దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. అయితే అయోధ్య సమీపంలో 22 ఏళ్ల దళిత యువతి పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై స్పందిస్తూ, కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడిస్తూ, భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Details

ఫిబ్రవరి 5న ఉప ఎన్నికలు

ఈ విషయాన్ని లోక్‌సభలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. 'మన ఆడబిడ్డల భద్రత విషయంలో విఫలమవుతున్నామని, పురుషోత్తమ రామ, సీతా మాత.. మీరు ఎక్కడ ఉన్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఫిబ్రవరి 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభకు ఫైజాబాద్ ఎంపీగా గెలిచిన అనంతరం, అవధేష్ ప్రసాద్ మిల్కిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ రామమందిరం నిర్మాణాన్ని ప్రచారంగా వినియోగించుకున్నా, అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంటరీ స్థానం సమాజ్‌వాదీ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో మిల్కిపూర్ ఉప ఎన్నికల విజయం కోసం బీజేపీ మరింత కృషి చేస్తోంది.

Details

కాలువలో మృతదేహం లభ్యం

అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీనూ విజయం సాధించేందుకు పోటీ పడుతోంది. ఇటీవల అయోధ్య జిల్లాలో ఓ కాలువలో అత్యాచార బాధిత యువతి మృతదేహం లభించింది. గురువారం రాత్రి మతపరమైన సమావేశానికి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. మృతదేహానికి దుస్తులు లేకపోవడంతో పాటు, శరీరంపై గాయాలు ఉండటంతో, ఆమెను తాళ్లతో కట్టివేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కంటతడి పెట్టుకున్న ఎంపీ