
Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ వేడుకను దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేందుకు హిందువులు సిద్ధమవుతున్నారు.
మారిషస్‌లోని హిందూ ఉద్యోగులకు ఆ దేశ ప్రభుత్వం 22న 2 గంటల ప్రత్యేక సెలవును మంజూరు చేసింది.
మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు.
భారత్‌లో జరగనున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నందున ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మేరకు మారిషస్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
మారిషస్‌లో హిందూ మతం అత్యంత ప్రముఖమైనది. ఈ దేశంలో హిందూమతాన్ని ఆచరించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మారిషస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన
Ram Temple opening in Ayodhya: Mauritian govt approves special break on Jan 22 for celebrations
— DD News (@DDNewslive) January 13, 2024
The Cabinet under the chairmanship of the PM Pravind Kumar Jugnauth agreed to grant off a one off special leave of two hours on 22 January 2024 as from 1400 hours to public officers… pic.twitter.com/0xPVxE6bCo