LOADING...
Unique Rama Temple: హనుమంతుడు లేని రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?
హనుమంతుడు లేని రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?

Unique Rama Temple: హనుమంతుడు లేని రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 27, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ఎక్కడ చూసినా శ్రీరాముడి పక్కన ఎడమవైపున సీతమ్మను దర్శించుకుంటాం. కానీ ప్రకాశం జిల్లాలోని ఒక ఆలయం మాత్రం ఈ సంప్రదాయానికి భిన్నంగా నిలుస్తోంది. ఇక్కడ రాములవారికి కుడివైపున సీతమ్మ కొలువై ఉండటం ప్రత్యేకతగా భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో ఉన్న ఈ ప్రాచీన ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. ఈ దేవాలయం 14వ శతాబ్దానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది. కాలగమనంలో కూడా ఈ ఆలయం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.

వివరాలు 

అంజన్న లేని రామాలయం!

ఇంకా ఒక విశేషం ఏమిటంటే... ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం కనిపించదు. దీనికి సంబంధించిన స్థలపురాణం ప్రకారం, శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆంజనేయుడితో ఆయనకు పరిచయం లేకపోవడం వల్లే ఇక్కడ హనుమంతుడి ప్రతిమ ప్రతిష్ఠించలేదని చెబుతున్నారు. ఈ అరుదైన లక్షణాలతో నిలిచిన ఆలయాన్ని ప్రభుత్వం 2018లో ప్రాచీన కట్టడంగా గుర్తించింది. అయినప్పటికీ ఆలయ అభివృద్ధి పనులు ఇంకా పూర్తిగా జరగలేదు. కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని స్థానిక గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement