Loading...
Banglore: జ్యూవెలరీ షాపులో వింత ఘటన.. వజ్రాల నగలు మాయం.. చివరకు ఎక్కడ దొరికాయంటే..!
జ్యూవెలరీ షాపులో వింత ఘటన.. వజ్రాల నగలు మాయం.. చివరకు ఎక్కడ దొరికాయంటే..!

Banglore: జ్యూవెలరీ షాపులో వింత ఘటన.. వజ్రాల నగలు మాయం.. చివరకు ఎక్కడ దొరికాయంటే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. అయినప్పటికీ ఉదయం దుకాణం తెరిచిన యజమానికి రూ.10లక్షల విలువైన వజ్రాల నగలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. చివరకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నగలను తీసుకెళ్లింది దొంగ కాదు.. ఒక చిన్న ఎలుక. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు నగరంలో కాల్టెక్స్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న విశ్వాస్ జ్యువెలరీలో ఈ అరుదైన ఘటన జరిగింది. మంగళవారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని కౌంటర్‌పై ఉంచిన 50 గ్రాములకు పైగా వజ్రాల నగలు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

వివరాలు 

దుకాణంలోకి ఎవరూ ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో..

వాటిలో 10 వజ్రాల ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు ఉండగా, వాటి మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలుగా అంచనా వేశారు.

దుకాణంలోకి ఎవరూ ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో యజమాని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

అందులో రాత్రి సమయంలో గోడలో ఉన్న చిన్న రంధ్రం గుండా లోపలికి వచ్చిన ఓ ఎలుక, ఒక్కో నగను నోటితో లాక్కెళ్లి తన బొరియలో దాచిపెడుతున్న దృశ్యాలు స్పష్టంగా నమోదయ్యాయి.

వివరాలు 

సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్..

ఆ ఫుటేజీ ఆధారంగా ఎలుక వెళ్లిన దారిని గుర్తించిన యజమాని బొరియను తవ్వించి పరిశీలించగా, కనిపించకుండా పోయిన 10 ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు సహా అన్ని వజ్రాల నగలు అక్కడే లభించాయి.

దీంతో నగలన్నీ తిరిగి దొరకడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. అన్ని ఆభరణాలు సురక్షితంగా లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం రాలేదు.

సినిమాల్లో కనిపించే సన్నివేశాన్ని తలపించిన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దొంగ కాదు.. ఎలుకే

ADVERTISEMENT