
TATA Family Tree: జామ్‌సెట్జీ టాటా నుండి రతన్ టాటా వరకు.. టాటా వంశవృక్షం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. ఈ గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా ఉత్పత్తులు ప్రపంచంలోని 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.
1868లో ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభమైన ఈ సంస్థకు రతన్ టాటా అధిపతిగా ఉన్నారు, కానీ ప్రస్తుతం ఆయన మన మధ్య లేరు.
టాటా కుటుంబంలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉన్నారు.
రతన్ దొరబ్ టాటా ఈ కుటుంబ వ్యాపారానికి పునాది వేశారు, ఆయనకు ఇద్దరు సంతానం. బాయి నవాజ్‌బాయి రతన్ టాటా, నుస్సర్వాన్‌జీ రతన్ టాటా.
నుస్సర్వాన్‌జీ ఒక పార్సీ పండితుడు. వ్యాపారంలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి. ఆయన 1822లో జన్మించి 1886లో మరణించారు.
వివరాలు
జంషెడ్జీ టాటా టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు
నుస్సర్వాన్‌జీ టాటాకు ఐదుగురు సంతానం ఉన్నాయి. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్జీ టాటా ఉన్నారు. ఆయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు.
టాటా గ్రూప్‌లోని స్టీల్ (టాటా స్టీల్) హోటళ్లు (తాజ్ మహల్) వంటి ప్రధాన వ్యాపారాలకు పునాది వేశారు.
ఆయనను భారతీయ పరిశ్రమ పితామహునిగా పిలుస్తారు, ఆయన జీవిత కాలం 1839 నుండి 1904 వరకు ఉంది.
దొరాబ్జీ టాటా:
దొరాబ్జీ టాటా జంషెడ్జీ టాటా పెద్ద కుమారుడు. జంషెడ్జీ టాటా తర్వాత టాటా గ్రూప్ వ్యాపారాన్ని ఆయనే చేపట్టారు. ఆయన జీవిత కాలం 1859-1932. టాటా పవర్ వంటి వ్యాపారాలను నెలకొల్పడంలో దొరాబ్జీ కీలక పాత్ర పోషించారు.
వివరాలు
రతన్ జీ టాటా:
రతన్‌జీ టాటా జంషెడ్జీ టాటా చిన్న కుమారుడు. ఆయన జీవితకాలం 1871 నుండి 1918 వరకు ఉంది. ఆయన టాటా గ్రూప్‌కు పత్తి మరియు వస్త్ర పరిశ్రమల వంటి వ్యాపారాలను జోడించారు.
జేఆర్‌డీ టాటా:
జేఆర్‌డీ టాటా పూర్తి పేరు జహంగీర్ రతన్ జీ దాదాభాయ్ టాటా. ఆయన జీవిత కాలం 1904-1993. ఆయన రతన్‌జీ టాటా, సుజానే బ్రియర్‌ల కుమారుడు. 50 ఏళ్లకు పైగా టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్‌డీ టాటా స్థాపించారు, ఈ విమానయాన సంస్థ పేరు ఎయిర్ ఇండియా.
వివరాలు
నావల్ టాటా:
నావల్ టాటా జీవిత కాలం 1904-1989. ఇతను రతన్‌జీ టాటా దత్తపుత్రుడు.రతన్ నావల్ టాటా 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా,2016-2017మధ్య తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్,టెట్లీ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌ల కొనుగోలులో నావల్ టాటా ముఖ్యమైన పాత్ర పోషించారు.ఈయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా కూడా ఉన్నారు.
రతన్ టాటా:
రతన్ టాటా జీవిత కాలం 1937 నుండి 2024 వరకు ఉంది.ఈయన నావల్ టాటా,సునీ కమిషరియట్‌ల కుమారుడు.రతన్ టాటా భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.
నోయల్ టాటా:
రతన్ టాటా వరుస సోదరుడు నోయెల్ టాటాకు ముగ్గురు కుమారులు ఉన్నారు.మాయా టాటా,నెవిల్లే టాటా,లియా టాటా.ఈ ముగ్గురు టాటా గ్రూప్‌లో వేర్వేరు వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు.