తదుపరి వార్తా కథనం

KTR : ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమే : కేటీఆర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 29, 2025
02:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్ర సమితి(BRS)స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. గల్లీ నుంచి దిల్లీ వరకు ఏ ఎన్నికైనా ఎదుర్కొనే దైర్యం తమ పార్టీకి ఉందని ఆయన పేర్కొన్నారు. 'కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని ఆ పార్టీ భావిస్తోంది. కానీ మేము తీసుకొచ్చిన 'బాకీ కార్డులు' వాళ్లకు గుర్తు చేస్తాయి. ఈ కార్డులు ఇంటింటికీ చేరతాయి. ఇవే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతాయి. కేసీఆర్‌నే తిరిగి తెచ్చుకోవాలని ప్రజలలో స్పష్టమైన ఆకాంక్ష ఉంది. ఉన్న హైదరాబాద్ నగరాన్ని సరిగా అభివృద్ధి చేయలేకపోతున్నారు.. కొత్త నగరాన్ని కడతామని ప్రకటిస్తున్నారు. మున్సిపల్ శాఖ విషయంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.