తదుపరి వార్తా కథనం

Rains: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 16, 2025
02:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు (శనివారం)జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎరుపు రంగు అలర్ట్ ప్రకటించింది. అలాగే రేపు(ఆదివారం)హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు కూడా ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసినట్టు స్పష్టం చేసింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 19 వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉత్తర,ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.