NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు
    దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు

    దిల్లీ: AQI తగ్గినప్పుడు 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్'.. ప్రస్తుతానికి బేసి-సరి నియమం లేదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2023
    05:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత 'చాలా పేలవంగా' పడిపోవడంతో, ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అక్టోబర్ 26, గురువారం నుంచి 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్' ప్రచారం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

    రెడ్ లైట్ల వద్ద వేచి ఉన్నప్పుడు వారి ఇంజిన్‌లను ఆపమని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం ఈ ప్రచారం లక్ష్యం.

    ప్రస్తుతం బేసి-సరి వాహనాల రేషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని రాయ్ చెప్పారు.

    బేసి-సరి పథకం కింద, బేసి సంఖ్యలతో ముగిసే రిజిస్ట్రేషన్ ప్లేట్‌లతో కూడిన ప్రైవేట్ వాహనాలు బేసి సంఖ్యల తేదీలలో, సరి సంఖ్యలు సరి తేదీలలో తిరుగుతాయన్నారు.

    Details 

    సమావేశాల్లో అధికారులు తప్పకుండా పాల్గోవాలి:  రాయ్ 

    దసరా సందర్భంగా ఢిల్లీలో పటాకులు కాల్చడం నిషేధమని రాయ్ తెలిపారు.

    మనం ఏ పని చేసినా దాని ప్రభావం మనపైనే ఉంటుందని,వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    కాలుష్యానికి సంబంధించిన సమావేశానికి అధికారులు హాజరుకాకపోవడంపై కూడా రాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

    సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పిలిచామని, ఒక్క శాఖ కార్యదర్శి కూడా హాజరు కాలేదన్నారు.

    ఇలాంటి సమావేశాల్లో అధికారులు తప్పకుండా పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.

    ఢిల్లీలో GRAP-2 (గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) అమలు చేయడానికి 28 విభాగాలతో సమావేశం జరిగింది.

    Details 

    దుమ్ము కాలుష్యాన్ని నివారించడానికి డస్ట్ సప్రెసెంట్ పౌడర్‌

    13 హాట్‌స్పాట్‌లతో పాటు, AQI 300 కంటే ఎక్కువ నమోదైన చోట మరో ఎనిమిది పాయింట్లు కూడా గుర్తించబడ్డాయి.

    ఈ ఎనిమిది పాయింట్ల వద్ద ప్రత్యేక బృందాలను నియమించాలని నోడల్‌లకు సూచించబడింది, ఇక్కడ స్థానిక కాలుష్య మూలాలను అంచనా వేస్తారని మంత్రి చెప్పారు.

    దిల్లీ నగరంలో దుమ్ము కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం డస్ట్ సప్రెసెంట్ పౌడర్‌ను కూడా ఉపయోగించాలని నిర్ణయించిందని రాయ్ చెప్పారు.

    ప్రధానంగా ఉష్ణోగ్రత, గాలి వేగం తగ్గడం వల్ల కాలుష్య కారకాలు పేరుకుపోవడంతో మే తర్వాత మొదటిసారిగా ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత "చాలా పేలవంగా" మారింది.

    రాజధాని 24 గంటల సగటు గాలి నాణ్యత సూచిక ఆదివారం 313 వద్ద ఉంది, శనివారం 248 నుండి క్షీణించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    దిల్లీ

    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ  జీ20 సమావేశం
    'దిల్లీ డిక్లరేషన్‌' వెనుక 200 గంటలు, 300 భేటీలు, 15 ముసాయిదాల కృషి జీ20 సమావేశం
    BRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ ఇటలీ
    దిల్లీ: దీపావళికి బాణాసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025