ED: పాక్‌తో సంబంధాలు.. మతబోధకుడిపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మతబోధకుడు శంసుల్ హుదా ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఒక సంస్థతో సహా తీవ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై తీసుకున్నట్లు EDఅధికారులు తెలిపారు. ప్రస్తుతం శంసుల్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. అధికారుల వివరాల ప్రకారం, శంసుల్ 1984లో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక మదర్సాలో సహాయ ఉపాధ్యాయుడిగా నియమితులయ్యాడు. 2013లో బ్రిటిష్ పౌరసత్వం పొందడంతో విదేశాలకు వెళ్లాడు. 2013-17మధ్య మదర్సాలో ఏ బోధనా విధులు నిర్వర్తించకపోయినా జీతం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. గత 20 ఏళ్లలో అనేక విదేశీ దేశాల్లో పర్యటించిన శంసుల్ భారతదేశంలోని పలు బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి నిధులు అందుకున్నారనే అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
Details
మత బోధకుడి ముసుగులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు
శంసుల్ తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహిస్తూ, మత బోధకుడి ముసుగులో చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దర్యాప్తులో అతను సుమారుగా రూ.30 కోట్ల విలువైన స్థిరాస్తులను సొంతం చేసుకున్నట్లు గుర్తించబడింది. నిందితుడు తన వ్యక్తిగత ఖాతాలతో పాటు ఒక ఎన్జీవో ద్వారా అనేక మదర్సాలకు నిధులు మళ్లించినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఆయన ఆజంగఢ్, సంత్ కబీర్ నగర్‌లో రెండు మదర్సాలను స్థాపించారని గుర్తించారు. యూకేలోని తీవ్రవాద సంస్థలతో శంసుల్ సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ED అధికారులు తెలిపారు. శంసుల్ పాకిస్థాన్‌ను కూడా సందర్శించగా, అక్కడి 'దావత్ ఏ ఇస్లామీ' సంస్థలో సభ్యుడిగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.